కేసీఆర్‌ అడిగి తెలుసుకుంటున్నారు: మంత్రి ఈటల

Minister Etala Rajender Talks On viral Fevers Precations In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గతంతో పోలిస్తే ఫీవర్‌ ఆస్పత్రుల‍్లో ప్రస్తుతం సదుపాయాలు మెరుగుపడ్డాయని, ఓపీ కౌంటర్‌ల సంఖ్యను 6 నుంచి 25కు పెంచామని వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. మంగళవారం ఫీవర్‌ ఆస్పత్రిని సందర్శించిన ఈటల అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైరల్‌ జ‍్వరాల గురించి అడిగి తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. తమకు కూడా ప్రతి ఆస్పత్రి నుంచి  నివేదికలు వస్తున్నాయని, వాటిని ముఖ్యమంత్రికి  సమర్పిస్తున్నామని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు అన్ని ప్రాంతాల్లో దోమతెరలు పంచుతున్నామని, ఉదయ సమయాల్లో సైతం దోమతెరలు ఉపయోగించాలని కోరారు. కాలం మారుతుండటం వల్ల అందరికీ జర్వాల బారిన పడుతున్నారని, ప్రతి ఒక్కరు కాచిన నీటినే తాగాలని సూచించారు. కాగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top