వివాహిత ఆత్మహత్య | Married woman commits suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Mar 3 2016 5:34 PM | Updated on Nov 6 2018 7:56 PM

వివాహిత కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.

ఓ గృహిణి వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. శామీర్‌పేట్ పోలీసులు వివరాలు... మండలంలోని ఉద్దమర్రి గ్రామానికి చెందిన ఎ.హంస(23) రమేశ్ భార్యభర్తలు. గత రెండు మాసాల క్రితం హంస భర్త రమేశ్ అప్పుల బాధతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈక్రమంలో తీవ్ర మనస్థాపానికి గురయిన రమేశ్ భార్య హంస గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరులేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌పోసుకుని నిప్పంటించుకుంది.

గమనించిన స్థానికులు కుటుంబీకులు 108, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న శామీర్‌పేట్ పోలీసులు మృతదేహానికి పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

కాగా ఉద్దమర్రికి చెందిన ఎ. హంస భర్త రమేశ్ ఇటీవల అప్పుల బాధతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో హంస తన భర్త లేని జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా హంసను ఆమె అత్తా,మామలు చంపేశారని హంస తల్లిదండ్రులు బందువులు ఆరోపించారు. మృతి చెందిన హంసకు ఒక బాబు ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement