సాయం చేయబోతే.. ప్రాణాలు పోయాయి! | man, who tried to help neighbour, loses life | Sakshi
Sakshi News home page

సాయం చేయబోతే.. ప్రాణాలు పోయాయి!

Mar 20 2015 4:47 PM | Updated on Oct 9 2018 5:39 PM

తోటి వ్యక్తి అడిగినందుకు సాయం చేసేందుకు ప్రయత్నించగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

మునగాల: తోటి వ్యక్తి అడిగినందుకు సాయం చేసేందుకు ప్రయత్నించగా  ఓ వ్యక్తి  ప్రాణాలు కోల్పోయాడు. మనసును కలిచివేసే ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునగాల మండలం కలకోవ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. సాయం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిపై చెట్టుపడటంతో గాయాలపాలై అతడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన గన్నా వెంకటేశ్వరరావు తన ఇంటి ముందు ఉన్న పెద్ద వేప చెట్టును నరికాడు.

అది పూర్తిగా కింద పడకపోవడంతో గ్రామానికి చెందిన కొమర్రాజు నర్సయ్యను సాయం కోరాడు. చెట్టు కొమ్మలకు తాడు కట్టి ఇద్దరూ కలసి లాగుతుండగా అకస్మాత్తుగా ఆ చెట్టు వారిపై పడింది. దీంతో నర్సయ్య తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement