పంజగుట్టలో అందరూ చూస్తుండగానే.. | Man Murdered In Hyderabad Due To Old Clashes | Sakshi
Sakshi News home page

పంజగుట్టలో అందరూ చూస్తుండగానే..

Oct 20 2019 11:42 AM | Updated on Oct 20 2019 11:52 AM

Man Murdered In Hyderabad Due To Old Clashes - Sakshi

పాతకక్షలతో పంజగుట్టలో ఓ వ్యక్తిని దుండగులు కత్తులతో వెంటాడి హత్య చేశారు.

సాక్షి, హైదరాబాద్‌ : మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన వ్యక్తిని దుండగులు కత్తులతో వెంటాడి హత్యచేసిన ఘటన పంజగుట్టలో జరిగింది. మూడు నెలల కిందట అన్వర్‌ అనే ఆటోడ్రైవర్‌ హత్య కేసులో నిందితుడు రియసత్‌ అలీని ఆదివారం ఉదయం మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా పంజగుట్ట ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు కత్తులతో వెంటాడి హత్య చేశారు. హత్య సమాచారం అందుకున్న క్లూస్‌ టీం, పంజగుట్ట పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అన్వర్‌ కేసులో ఏ1గా ఉన్న రియసత్‌ అలీ హత్య పాత కక్షల కారణంగానే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement