ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ సిటీ | Hyderabad surpasses metro cities across the country | Sakshi
Sakshi News home page

ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ సిటీ

Mar 29 2026 4:20 AM | Updated on Mar 29 2026 4:20 AM

Hyderabad surpasses metro cities across the country

దేశవ్యాప్తంగా మెట్రో నగరాలను దాటేసిన హైదరాబాద్‌  

అత్యంత నివాసయోగ్య నగరంగా టాప్‌ప్లేస్‌ 

తాజాగా విడుదలైన ‘వుయ్‌ ఆర్‌ సిటీ–2026’నివేదిక స్పష్టీకరణ 

సాక్షి, సిటీబ్యూరో: జీవన సౌలభ్యాన్ని అంచనా వేయడానికి నిర్వహించిన అధ్యయనంలో సిటీ టాప్‌ ప్లేస్‌ను కైవసం చేసుకుంది. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌లో నెంబర్‌ వన్‌గా నిలిచింది. రియల్‌ ఎస్టేట్‌ వృద్ధి, రవాణాసౌకర్యం, ఆహ్లాదకరమైన వాతావరణాలతోపాటు వే ర్వేరు విభాగాల్లో 15 కొలమానాల ఆధారంగా దేశంలోని ఎనిమిది మెట్రో నగరాల్లో ఈ అధ్యయనం నివేదిక రూపొందింది. ఈ కొత్త నివేదిక ప్రకారం, భారతదేశంలో అత్యంత ‘నివాసయోగ్యమైన’మ హానగరంగా బెంగళూరును అధిగమించి హైదరాబాద్‌ నిలిచింది.  

నివేదిక నేపథ్యం... 
బెంగళూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ అన్‌బాక్సింగ్‌ బీఎల్‌ఆర్‌((బెంగుళూరు నగరం యొక్క కళలు, సంస్కృతి, సాంకేతికత మరియు వారసత్వాన్ని ప్రదర్శించే ఓ వార్షిక వేడుక) ప్రచురించిన ‘వుయ్‌ ఆర్‌ సిటీ–2026’వార్షిక నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన ఇండియాస్పోరా గ్లోబల్‌ ఏఐ సదస్సులో ఈ డేటా నివేదికను విడుదల చేశారు. 

‘సిటీ ఇండెక్స్‌’పేరిట వెలువరించిన 159 పేజీల నివేదికలో, ప్రయాణం, వైవిధ్యం, అవుటింగ్, గృహవసతి, మౌలిక సదుపాయాలు చివరగా వాతావరణం వంటి కొలమానాలను ఉపయోగించి జీవన సౌలభ్యం ఆధారంగా ఎనిమిది నగరాలకు ర్యాంకులు ఇచ్చారు. ఈ ర్యాంకుల ప్రకారం ఉద్యోగాలు, వినియోగం, రవాణా వంటి అంశాల్లో రెండు టెక్‌ హబ్‌లు హైదరాబాద్, బెంగుళూర్‌లు భారతదేశ వృధ్ధికి చోదకశక్తిగా నిలుస్తున్నాయని ఈ నివేదిక తేల్చి చెప్పింది. జనాభాపరంగా ముంబై, ఢిల్లీ ఎంతో పెద్దవైనప్పటికీ ఆర్థిక వృద్ధిలో మాత్రం ఈ రెండు నగరాలు వాటిని మించిపోతున్నాయి.  

సిటీ ర్యాంక్‌ను పెంచిన వైవిధ్యం... 
గృహ వసతి, జీవన వైవిధ్యం వంటి అంశాలు హైదరాబాద్‌ ర్యాంకింగ్‌ను పెంచగా, ప్రయాణ సమయం మౌలిక సదుపాయాలు బెంగళూరును రెండవ స్థానానికి నెట్టాయి. ఒక్కో విభాగంలో ఒక్కొక్క నగరం సత్తా చాటినప్పటికీ మొత్తం మీద హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు కోల్‌కతా నిలిచాయి. 

అహ్మదాబాద్‌ అట్టడుగున నిలవగా, చెన్నై, ఢిల్లీ ఎన్‌సిఆర్, పూణే, గ్రేటర్‌ ముంబై వరుసగా నాలుగవ, ఐదవ, ఆరవ మరియు ఏడవ స్థానాల్లో నిలిచాయి. కొత్త కంపెనీల ఏర్పాటు, గ్రేడ్‌–ఎ ఆఫీస్‌ స్పేస్‌లు జీసీసీ సెటప్‌ల వంటి రంగాలలో హైదరాబాద్‌ బెంగళూరుకు సవాలుగా ఎదుగుతోందని కూడా నివేదిక తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement