
లారీ ఢీకొని 158 గొర్రెలు మృతి
శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 158 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
జగిత్యాల జోన్: జగిత్యాల జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 158 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. జగిత్యాల మండలం ధర్మారంవాసులు ఎనుగుల ఐలయ్య, నందెల్లి హరీశ్‌లు గొర్రెల మందను రాత్రి ఇంటికి తీసుకొసుండగా గ్రామశివారులో లారీ ఢీ కొంది. దీంతో 150 గొర్రెలు మృతి చెందాయి.
కిలో మీటరు దూరంలో అదే రోడ్డుపై పరుమాళ్ల చిన్న రాజయ్య, పరుమాళ్ల పెద్ద రాజయ్యలు తమ గొర్రెల మందను ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో 8 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గొర్రెలను రోడ్డు నుంచి పక్కకు జరుపుతుండగా పాక రాజం అనే వ్యక్తిని జగిత్యాల నుంచి గొల్లపల్లి వెళ్తున్న కారు ఢీకొట్టింది.