అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకుందాం

Lets Protect The Attracity Act  - Sakshi

సాక్షి, మక్తల్‌ : కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేందుకు కుట్ర పన్నిందని సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కె.వై రత్నం, కేఎన్‌పీఎస్‌ రాష్ట్ర నాయకుడు డి.చంద్రశేఖర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని ఎస్‌ఎస్‌ పంక్షన్‌హాల్లో కేఎన్‌పీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా మొదటి మహసభలో వారు అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. అంటరానితనం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలను చేయాలని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్ధాలు దాటుతున్నా ఇంకా ప్రజలు తమ హక్కులను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత పీడిత కులాల మహిళలను అవమానించే రీతిలో జోగిని, బస్వినీలుగా మార్చే సంస్కృతి నుంచి బయట పడాలని సూచించారు. తెలంగాణ వచ్చిన వెంటనే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్‌ మాట మార్చారని, మైనార్టీలపై దాడులు చేస్తుంటే  పట్టించుకోవడంలేదన్నారు. సమాజంలో సామాజిక సమానత్వం, స్వేచ్ఛ, సౌబ్రాతృత్వం విలువలను కాపాడాటానికి అందరు తమవంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కెఎన్‌పీఎస్‌ రాష్ట్ర నాయకులు భూరం అభినవ్, రాములు, బండారి నర్సప్ప, రమేష్, లింగన్న, కృష్ణ, శ్రీదేవి, రాంచందర్, మద్దిలేటి, వామన్, మున్వర్‌అలీ,  బండారి లక్ష్మణ్, వెంకటేస్‌ తదితరులు పాల్గొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top