కట్నం కోసం కడతేర్చారు | Killed for A dowry | Sakshi
Sakshi News home page

కట్నం కోసం కడతేర్చారు

Feb 13 2016 4:14 AM | Updated on Sep 3 2017 5:31 PM

కట్నం కోసం కడతేర్చారు

కట్నం కోసం కడతేర్చారు

అదనపు కట్నం వేధింపులకు మరో అబల బలైంది.

అత్తింటివారి దాష్టీకం
సిద్దిపేటలో ఘటన..  సిరిసిల్లలో విషాదం


సిరిసిల్ల టౌన్: అదనపు కట్నం వేధింపులకు మరో అబల బలైంది. ఘటన మెదక్ జిల్లా సిద్దిపేటలో చోటుచేసుకోగా.. సిరిసిల్లలోని పుట్టింట విషాదం అలుముకుంది. బాధితుల కథనం.. సిరిసిల్ల సుభాశ్‌నగర్‌కు చెందిన అన్నల్‌దాస్ ఆనందం-లలితలకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రెండో కూతురు అరుణ(21)ను రెండేళ్ల క్రితం సిద్దిపేటకు చెందిన పెద్ది చరణ్‌కు ఇచ్చి పెళ్లిచేశారు. వివాహ సమయంలో రూ.5 లక్షలు కట్నంగా ఇచ్చారు. అంతేకాకుండా చరణ్‌కు సిరిసిల్లలో కంప్యూటర్ మెకానిక్‌గా దుకాణం పెట్టించి బిడ్డను మంచిగా చూసుకోవాలని కోరారు. కానీ పెళ్లైన రెండు నెలలు తిరక్కుండానే అరుణకు అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఇటీవలె అరుణ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆడ పిల్ట పుట్టిందని అదనంగా మరో రూ. 5 లక్షల కట్నం తీసుకురావాలని వేధింపులను మరింత తీవ్రతరం చేశారు. తామున్న పరిస్థితిలో ఇచ్చుకోలేమని అరుణ తల్లిదండ్రులు వేడుకున్నా.. వినిపిం చుకోలేదు. పెళ్లిరోజు వస్తుందని పదిరోజుల క్రితం అరుణ సిద్దిపేటలోని అత్తింటికి పోయింది. కానీ.. శుక్రవారం ఉదయం అరుణను చరణ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు ఉరివేసి చంపారని బాధితులు ఆరోపించారు. ఉరేసి చంపినట్లు సిద్దిపేటలో వైద్యులు తెలిపారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement