కేశినేని బస్సు బోల్తా: 15 మందికి గాయాలు | kesineni bus rolls in nalgonda | Sakshi
Sakshi News home page

కేశినేని బస్సు బోల్తా: 15 మందికి గాయాలు

Jul 4 2015 6:31 AM | Updated on Sep 3 2017 4:53 AM

కేశినేని బస్సు బోల్తా: 15 మందికి గాయాలు

కేశినేని బస్సు బోల్తా: 15 మందికి గాయాలు

కేశినేని ట్రావెల్స్ బస్సు శనివారం తెల్లవారుజామున బోల్తా పడింది.

నల్లగొండ: కేశినేని ట్రావెల్స్ బస్సు శనివారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు అదే దారిలో వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోతూ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement