కేసీఆర్.. సెటిలర్లకు క్షమాపణ చెప్పు: పొన్నాల | kcr say sorry to seemandhra settlers | Sakshi
Sakshi News home page

కేసీఆర్.. సెటిలర్లకు క్షమాపణ చెప్పు: పొన్నాల

Apr 20 2014 2:51 AM | Updated on Aug 15 2018 9:06 PM

కేసీఆర్.. సెటిలర్లకు క్షమాపణ చెప్పు: పొన్నాల - Sakshi

కేసీఆర్.. సెటిలర్లకు క్షమాపణ చెప్పు: పొన్నాల

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ వెంటనే తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్ర సెటిలర్లకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు.

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ వెంటనే తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్ర సెటిలర్లకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి రావడంలో సెటిలర్ల భాగస్వామ్యం ఉందని, అలాంటప్పుడు వాళ్ల ఓట్ల కోసం ప్రత్యేకించి వెంపర్లాడాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు.

రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు వీజీఆర్ నారగోని, తెలంగాణ మాదిగ పోరాట సమితి నాయకుడు తాటికాయల జయరాం మాదిగతో పాటు మహాత్మాగాంధీ ఆటో యూనియన్‌కు చెందిన పలువురు నాయకులు శనివారం పొన్నాలను కలిసి, కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పొన్నాల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని సెటిలర్ల ఓట్లు టీఆర్‌ఎస్‌కు రావనే నైరాశ్యంతోనే కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement