కోడెలపై కరీంనగర్‌ కోర్టు ఉత్తర్వులు రద్దు

Karimnagar court orders canceled on Kodela - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై దాఖలైన ప్రైవేటు కేసులో విచార ణకు హాజరుకావాలంటూ కరీంనగర్‌ కోర్టు జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్య నారాయణమూర్తి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ. 11.50 కోట్లు వెచ్చించినట్లు కోడెల ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో పేర్కొన్నారని, ఇంత భారీ మొత్తం వెచ్చించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని కరీంనగర్‌ వావిలాలపల్లికి చెందిన భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి గతేడాది ప్రైవేటు కేసు దాఖలు చేశారు. కరీంనగర్‌ ఫస్ట్‌క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ దీన్ని పరిగణనలోకి తీసుకుని కోడెల కేసు విచారణకు హాజరుకావా లని గతంలో ఆదేశించారు. దీనిపై కోడెల హైకోర్టులో సవాల్‌ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top