నోటీసులపై ‍స్పందించిన జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌

jubilee Hills Public School Responds To Education Department Notice - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన క్రమంలో అధికారులు గురువారం స్కూల్‌లో తనిఖీలు చేపట్టారు. అవకతవకలు జరిగాయని గుర్తించిన విద్యాశాఖ అధికారులు జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌, గీతాంజలి స్కూళ్లకు నోటిసులు పంపించారు. పూర్తి రికార్డులు  సమర్పించాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

దీనిపై స‍్పందించిన స్కూళ్ల యాజమాన్యాలు డీఈవోకు రికార్డులు సమర్పించారు.  స్కూళ్ల యజమాన్యాలు ఇప్పటికే జీవో నెంబర్‌ 46ను ఉల్లంఘించాయని అధికారులు తెలుసుకున్నారు. వీటితో పాటు మెరిడియన్‌, నీరబ్‌ పబ్లిక్‌ స్కూళ్లల్లో కూడా  నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు అధికారులు గుర్తించారు.  రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించిన తరువాత వారిపై చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు. 

చదవండి: ‘జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌’ దొరికిపోయింది!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top