పథకాల అమలులో మనమే నంబర్‌వన్‌

Jagadish Reddy Criticize On Congress Leaders Nalgonda - Sakshi

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, హోంమంత్రి నాయిని నర్సిం హారెడ్డి అన్నారు. దేవరకొండలో ఆదివారం జరిగిన టీఆర్‌ఎస్‌ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధి పథకాలు ఆగిపోతాయన్నారు. అదే విధంగా నల్లగొండలో జరిగిన టీఆర్‌ఎస్‌ సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. అనంతరం ఈనెల 4న జరగనున్న సీఎం కేసీఆర్‌ బహిరంగ సభా ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు.

దేవరకొండ (నల్లగొండ రూరల్‌): దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలిచిందని మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం దేవరకొండలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని వారు   మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలతో పాటు లేని హామీలను సైతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థులకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఎదుర్కొనే శక్తి లేదని, మహాకూటమి పేరుతో ప్రజలను మభ్యపెట్టేం దుకు వస్తున్నారని, ప్రజలు గమనించా లన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారడానికి కారణం కాంగ్రెస్‌ పార్టీ్టయేనని, ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపివేయాలని కేసులు వేస్తూ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారని ఆరోపించారు.

అనంతరం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌లు మాట్లాడుతూ రాను న్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని అత్యధిక మెజా ర్టీతో గెలిపించి దేవరకొండ ఖిల్లాపై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అం తకుముందు భారీ ర్యాలీగా సమావేశ ప్రాంతానికి చేరుకున్న మంత్రులకు టీఆర్‌ఎస్‌ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నార్మాక్స్‌ చైర్మన్‌ గుత్తా జితేందర్‌రెడ్డి, దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, మున్సిపల్‌ చైర్మన్‌ వడ్త్య దేవేందర్, మార్కెట్‌ చైర్మన్‌ బండారు బాలనర్సింహ, తేర గోవర్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మారుపాకుల సురేష్‌గౌడ్, నల్లగాసు జాన్‌యాదవ్, గాజుల ఆంజనేయులు, నేనావత్‌ రాంబాబు, హన్మంతు వెంకటేశ్‌గౌడ్, పున్న వెంకటేశ్, ముత్యాల సర్వయ్య, ముక్కమల వెంకటయ్య, ఏడ్పుల గోవిందు,  నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కారు గుర్తుకే ఓటు వేయాలి  
నల్లగొండ రూరల్‌ : రాష్టానికి పట్టిన శని పోవాలంటే ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ నల్లగొండ మండల కమిటీ సర్వసభ్య సమావేశం బైపాస్‌లోని ఎంఎన్‌ఆర్‌ గార్డెన్‌లో నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడారు. 60ఏళ్లు రాష్టాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు రాష్టాన్ని నాశనం చేశాయని ఆరోపించారు. జిల్లా తలాపున కృష్ణానది పారుతున్నా సాగునీరు లేదు..కనీసం తాగునీరు అందివ్వకపోగా రోగాలను, ఫ్లోరోసిస్‌ అందించారని, పైగా జిల్లానే ఎడారిగా మార్చారని విమర్శించారు. నల్లగొండ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కారుగుర్తుకు ఓటు వేయాలన్నారు.

రైతు సమన్వయసమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి,ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ నల్లగొండకు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి శని అన్నారు. పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చేసి చూపిస్తా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈసమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడకిషన్‌ రెడ్డి, పార్టి మండల, పట్టణ అధ్యక్షుడు బకరం వెకంన్న, అబ్బగోని రమేష్‌గౌడ్, ఐసీడీఎస్‌ కోఆర్డినేటర్‌ శరణ్యరెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ రేఖల భద్రాద్రి, మార్కెట్‌ చైర్మన్‌ ఖరీంపాష,  ఎంపీపీ దైద రజితా వెంకట్‌రెడ్డి,  బక్కపిచ్చయ్య, కట్టశ్రీను,  జిల్లా శంకర్, దేపవెంకట్‌ రెడ్డి, రాజ్‌పేట మల్లేష్‌గౌడ్, గాదె రాంరెడ్డి, కె.సత్యనారాయణ, బోయపల్లి కృష్ణారెడ్డి,  రవీందర్‌ రెడ్డి, బడుపుల శంకర్,  అండాలు గట్టయ్య పాల్గొన్నారు.

సీఎం సభాస్థలాన్ని పరిశీలించిన మంత్రి

నల్లగొండ రూరల్‌ : ఈనెల 4న నల్లగొండ బైపాస్‌లోని ఎంఎన్‌ఆర్‌ గార్డెన్‌ వద్ద నిర్వహించే సీఎం కేసీఆర్‌ ఆశీర్వాద బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడారు. కొంగరకలాన్‌ సభకు వెళ్లలేని వారంతా సీఎం సభకు వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమావేశాలను చూస్తుంటే ఎన్‌జీ కాలేజి స్థలం సరిపోదని బైపాస్‌కు మార్చినట్లు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top