'తెలంగాణ వారసత్వాన్ని పదిలం చేద్దాం' | intach invites volinteers to help to document telangana heritage | Sakshi
Sakshi News home page

'తెలంగాణ వారసత్వాన్ని పదిలం చేద్దాం'

May 12 2015 3:10 PM | Updated on Sep 3 2017 1:54 AM

ఇన్టాక్ జిల్లా ఖజానా తెలంగాణ స్టేట్.. తెలంగాణ వారసత్వంపై డాక్యుమెంటరీ రూపొందించనుంది.

హైదరాబాద్: 'ఇన్టాక్' సంస్థ తెలంగాణ విభాగం త్వరలోనే తెలంగాణ వారసత్వాన్ని గ్రంథస్థం చేయనుంది. తెలంగాణలోని వారసత్వ కట్టడాలకు సంబంధించిన సమాచారం, ఫొటోలను పంపవలసిందిగా ఇన్టాక్ ఓ ప్రకటనలో కోరింది. ఆసక్తిగలవారు  కోటలు, ప్రభుత్వ పాత భవనాలు, ప్రైవేట్ బిల్డింగ్స్, మసీదులు, దర్గాలు, ఆలయాలు, చర్చిలు, సిక్కుల గురుద్వారాలు, ధర్మశాలలు, పార్శి అగ్ని దేవాలయాలు, సత్రాలకు సంబంధించిన సమాచారం, ఫొటోలను పంపవచ్చు. అలాగే సరస్సులు, శిలలు, గార్డెన్స్, పాతకాలం నాటి చెట్లు, పవిత్ర వనాలు (మత విశ్వాసాలకు సంబంధించినవి), పురాతన ధ్వజస్తంభాలు, చారిత్రక స్మారక చిహ్నాలకు సంబంధించిన సమాచారాన్ని, ఫొటోలను పంపాలని కోరింది. ఇవి ఉన్న ప్రాంతాల చిరునామా, వీటికి సంబంధించి సంక్షిప్త చరిత్రను తెలియజేయాలని కోరింది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలతో పాటు మీడియా సహకారం అందించాలని విన్నవించింది.

ఫొటోలు, సమాచారాన్ని ఇన్టాక్ హైదరాబాద్ చాప్టర్, 6-1-280/A, పద్మారావు నగర్, సికింద్రాబాద్ లేదా తెలంగాణ & సర్ రొనాల్డ్ రాస్ బిల్డింగ్, సీజీహెచ్ఎస్ ఆస్పత్రి వెనుక, బేగంపేట్, హైదరాబాద్ చిరునామాకు పంపవచ్చు. డిజిటల్ ఫొటోగ్రాఫ్స్, సమాచారాన్ని intachzkts@gmail.com లేదా intachtelangana1@gmail.comకు మెయిల్ చేయవచ్చు. మరిన్ని వివరాలకు ఇన్టాక్ తెలంగాణ స్టేట్ కో కన్వీనర్ పి.అనురాధ రెడ్డి  (ఫోన్ నెం. 09441181247, మెయిల్: intach.hyd@gmail.com) సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement