కారులో టేకు అక్రమ రవాణా | Illegal transportation of Timber detected by Forest officers | Sakshi
Sakshi News home page

కారులో టేకు అక్రమ రవాణా

Sep 15 2015 3:34 PM | Updated on Sep 3 2017 9:27 AM

కారులో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం క్రాస్ రోడ్డు వద్ద అటవీ శాఖ అధికారులు మంగళవారం మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్నారు.

బెల్లంపల్లి (ఆదిలాబాద్) : కారులో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం క్రాస్ రోడ్డు వద్ద అటవీ శాఖ అధికారులు మంగళవారం మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్నారు. కారుతోపాటు అందులోని 12 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ జగదీశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాసిపేట్ మండలం నుంచి మంచిర్యాలకు తరలిస్తున్నట్లుగా వెల్లడైంది.

Advertisement
 
Advertisement
Advertisement