ఇక్రిశాట్ డెరైక్టర్‌గా తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ | ICRISAT director CS Rajiv Sharma in Telangana | Sakshi
Sakshi News home page

ఇక్రిశాట్ డెరైక్టర్‌గా తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ

Aug 14 2014 3:33 AM | Updated on Sep 2 2017 11:50 AM

ఇక్రిశాట్ డెరైక్టర్‌గా తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ

ఇక్రిశాట్ డెరైక్టర్‌గా తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ

అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా కేంద్రం (ఇక్రిశాట్) డెరైక్టర్‌గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కేంద్ర ప్రభుత్వం నియమించింది.

 హైదరాబాద్: అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా కేంద్రం (ఇక్రిశాట్) డెరైక్టర్‌గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి అశీష్ బహుగుణ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇక్రిశాట్‌లో డెరైక్టర్‌గా వ్యవహరించేవారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇక్రిశాట్ తెలంగాణ రాష్ర్ట పరిధిలోకి వచ్చినందున.. రాష్ట్రం నుంచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డెరైక్టర్‌గా వ్యవహరిస్తారని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇక్రిశాట్‌లో భారతదేశం నుంచి ముగ్గురు డెరైక్టర్లు ఉంటే.. అందులో తెలంగాణ సీఎస్ ఒకరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement