యాచకుల పునరావాస కల్పనపై కమిటీ  | Committee on Rehabilitation of Beggers | Sakshi
Sakshi News home page

యాచకుల పునరావాస కల్పనపై కమిటీ 

Jul 11 2018 1:21 AM | Updated on Jul 11 2018 1:21 AM

Committee on Rehabilitation of Beggers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పట్టణ ప్రాంతాల్లోని యాచకుల పునరావాస కల్పనపై రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో యాచకుల పునరావాసంపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..త్వరలో ఎన్జీవో, ప్రభుత్వేతర సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి యాచకుల పునరావాసానికి మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు. యాచకులకు ఉచిత వైద్య సేవలతో పాటు, స్వయం ఉపాధిని కల్పిస్తామనిమున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement