భార్యను గడ్డపారతో కొట్టి చంపిన భర్త | husband killed his wife | Sakshi
Sakshi News home page

భార్యను గడ్డపారతో కొట్టి చంపిన భర్త

May 15 2016 8:29 AM | Updated on Jul 27 2018 2:18 PM

వరంగల్ జిల్లా నర్సంపేట శివారులోని కాకతీయ నగర్‌కు చెందిన బైరగోని ఎల్లయ్య గౌడ్ తాగిన మత్తులో భార్య పద్మను గడ్డపారతో కొట్టి హతమార్చాడు.

వరంగల్ : వరంగల్ జిల్లా నర్సంపేట శివారులోని కాకతీయ నగర్‌కు చెందిన బైరగోని ఎల్లయ్య గౌడ్ తాగిన మత్తులో భార్య పద్మను గడ్డపారతో కొట్టి హతమార్చాడు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎల్లయ్యగౌడ్, పద్మలకు 23 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. తాగుడుకు బానిసైన ఎల్లయ్యగౌడ్ తరుచూ భార్యతో ఘర్షణ పడేవాడు. ఆ క్రమంలో ఎప్పటిలాగే శనివారం అర్థరాత్రి కూడా తాగి వచ్చి భార్యతో గొడవపడ్డాడు.

ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పక్కనే ఉన్న గడ్డపారతో పద్మ తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో కుప్పకూలింది. కుటుంబసభ్యులు ఆమెను వెంటనే నర్సపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మృతిచెందింది. భార్య మృతి చెందిన విషయం తెలిసిన ఎల్లయ్యగౌడ్ భవనంపైకి ఎక్కి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో రెండు కాళ్లు విరిగాయి. అతనిని ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై నర్సపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement