ఏడు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక | Hot winds alert to seven districts | Sakshi
Sakshi News home page

ఏడు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక

Apr 24 2017 9:01 PM | Updated on Sep 5 2017 9:35 AM

ఏడు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక

ఏడు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక

వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో మంగళవారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూలు, వనపర్తి, జగిత్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. భద్రాచలం, ఖమ్మం, నల్లగొండల్లో సోమవారం అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement