వరంగల్‌లో హెల్త్ యూనివర్సిటీ | Health university to be formed in Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో హెల్త్ యూనివర్సిటీ

Jun 20 2014 12:42 AM | Updated on Apr 7 2019 3:47 PM

తెలంగాణ హెల్త్ యూనివర్సిటీని వరంగల్‌లో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని ఉపముఖ్యమంత్రి,

- ప్రభుత్వం వద్ద ప్రతిపాదన
- మంత్రి రాజయ్య వెల్లడి

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హెల్త్ యూనివర్సిటీని వరంగల్‌లో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.రాజయ్య చెప్పారు. కొత్తగా రూపుదిద్దుకుంటున్న బీబీనగర్ నిమ్స్‌లో ఉన్న విధంగానే వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలోనూ హెల్త్ యూనివర్సిటీకి కావాల్సిన అన్ని మౌలిక వసతులు ఉన్నట్లు తెలిపారు. అయితే, ఈ విషయంలో ముఖ్యవుంత్రి  కేసీఆర్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గురువారం తొలిసారిగా ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్‌ను సందర్శించారు. ఎమర్జెన్సీ, ట్రామా కేర్, సూపర్‌స్పెషాలిటీ, మిలీనియం, ఓపీ బ్లాక్‌ల్లోకి వెళ్లి, వైద్య సేవలు అందుతున్న తీరును ఆయున ఆరా తీశారు. అనంతరం డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నిమ్స్‌లో శిథిలావస్థకు చేరుకున్న ఫిజియోథెరపీ యూనిట్‌ను ఆధునీకరించి, రోగులకు మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. మరో రెండు మాసాల్లో బీబీనగర్‌లో ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకువస్తావున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement