రూ.50 కే 15 రకాల వైద్య పరీక్షలు

Health Centres in Kachiguda And Secunderabad Railway Stations - Sakshi

రైల్వేస్టేషన్లలో హెల్త్‌కియోస్క్‌ల ఏర్పాటు

సాక్షి, సిటీబ్యూరో: కాచిగూడ, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లలో  ఏర్పాటు చేసిన హెల్త్‌కియోస్క్‌ లు  ప్రయాణికులకు  ఎంతో ప్రయోజనకరం గా  ఉన్నాయి. కేవలం రూ.50 కే 15 రకాల  ఆరోగ్య పరీక్షలు చేసుకొనే  అవకాశం లభించ డంతో  ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల లోని  ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై  వీటిని  అందుబాటులో ఉంచారు. రక్తపోటు, షుగర్‌.బరువు, బోన్‌మారో,  శరీరంలో కొలెస్ట్రాల్, ప్రొటీన్‌ స్థాయి తదితర 15 రకాల పరీక్షలపైన  ఒక అవగాహన లభిస్తుంది. ముఖ్యంగా  వేల కొద్దీ కిలోమీటర్లు ప్రయాణం చేసేవారు. నిద్రలేమి, అలసట తదితర సమస్యలతో బాధపడేవారు  ప్రయాణ సమయంలో  తమ ఆరోగ్యస్థితిని తెలుసుకొనేందుకు ఈ కియోస్క్‌లు దోహదం చేస్తాయి.

ప్రతి రోజు సికింద్రాబాద్‌ నుంచి 1.95 లక్షల మంది, కాచిగూడ నుంచి లక్ష మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. రూ. వందల్లో  ఖర్చయ్యే  వైద్య పరీక్షలను కేవలం రూ.50 లకే అందజేస్తుండటంతో ప్రయాణికులు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి  ఒకరు  అభిప్రాయపడ్డారు. అయితే  ఇది ప్రయాణికులకు తమ ఆరోగ్యం పట్ల ఒక ప్రాథమిక అవగాహనను  కల్పిస్తుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top