అక్రమంగా నిల్వ ఉంచిన భారీ గుట్కా ప్యాకెట్లను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు.
రూ.1.50 లక్షల గుట్కా స్వాధీనం
Mar 1 2016 1:58 PM | Updated on Sep 26 2018 6:49 PM
మిర్యాలగూడ : అక్రమంగా నిల్వ ఉంచిన భారీ గుట్కా ప్యాకెట్లను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కుండలబజారుకు చెందిన గోకరాజు రాజు అనే వ్యక్తి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. పది బస్తాల్లో నిల్వ ఉంచిన రూ.1.50 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకుని, రాజును అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ సీఐ బిక్షపతి తెలిపారు.
Advertisement


