రోడ్డుపై పడ్డ ధాన్యం బస్తాలు | Grain bags on the road | Sakshi
Sakshi News home page

రోడ్డుపై పడ్డ ధాన్యం బస్తాలు

May 10 2018 1:50 PM | Updated on Oct 17 2018 6:10 PM

Grain bags on the road - Sakshi

లారీ నుంచి పడిపోయిన ధాన్యం బస్తాలు

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌) : పరిమితికి మించి ధాన్యం బస్తాలను లోడ్‌ చేసుకుని వెళ్తున్న ఓ లారీ నుంచి బస్తాలు రోడ్డుపై జారీ పడ్డాయి. బుధవారం ఉదయం దాస్‌నగర్‌ మీదుగా వెళ్తున్న ఈ లారీ నగర శివారులోని ముబారక్‌నగర్‌ వద్దకు రాగానే ఒక్కసారిగా 30 బస్తాల వరకు కింద పడ్డాయి. ఆ సమయంలో లారీ వెనుకాల ఇతర ఏ వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.  మధ్యాహ్నం వరకు బస్తాలు అలాగే ఉండడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఓవర్‌ లోడ్‌తో ధాన్యం బస్తాలను నింపడం మూలంగానే లారీలోంచి పడిపోయినట్లు తెలుస్తోంది. ఓవర్‌లోడ్‌తో ఇటీవల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా... ఆర్‌టీఏ అధికారులు అధిక ధాన్యం బస్తాలతో రవాణా చేస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement