అప్పులబాదతో యువరైతు ఆత్మహత్య | former dies due to over debits | Sakshi
Sakshi News home page

అప్పులబాదతో యువరైతు ఆత్మహత్య

Aug 23 2015 7:14 PM | Updated on Nov 6 2018 7:56 PM

రెండు సంవత్సరాలుగా కాలం కలిసిరాక పోవడంతో.. పెట్టిన పెట్టుబడి తిరిగి రాక.. తెచ్చిన అప్పు కొండ లా పెరిగిపోయి.. దిక్కుతోచక యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

నాగార్జునసాగర్: రెండు సంవత్సరాలుగా కాలం కలిసిరాక పోవడంతో.. పెట్టిన పెట్టుబడి తిరిగి రాక.. తెచ్చిన అప్పు కొండ లా పెరిగిపోయి.. దిక్కుతోచక యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల గ్రామ పంచాయతి పరిధిలోని సుబ్బరాయ తండలో ఆదివారం జరిగింది. వివరాలు..

గ్రామానికి చెందిన రమావత్ శ్రీను(29) తనకున్న నాలుగెకరాల భూమితో పాటు గ్రామానికి చెందిన మరో రైతుకు చెందిన ఐదెకరాల భూమి కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేస్తున్నాడు. రెండు సంవత్సరాలుగా పంట దిగుబడి సరిగా రాలేదు. తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు దీంతో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement