పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన రైతు ప్రమాదవశాత్తూ విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం వెంకటాపురం గ్రామంలో గురువారం ఉదయం జరిగింది.
నిజామాబాద్: పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన రైతు ప్రమాదవశాత్తూ విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం వెంకటాపురం గ్రామంలో గురువారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన గంగి వీరన్న(60) ఈరోజు ఉదయం పొలానికి నీళ్లు కట్టడానికి బావి వద్దకు వెళ్లాడు. పంపు పనిచేయకపోవడంతో దాన్ని సరిచేయడానికి ప్రయత్నించగా ప్రమాదవశాత్తూ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.