విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌! | Fire Breaks Out At Narketpally Substation In Nalgonda District | Sakshi
Sakshi News home page

సబ్‌ స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిన మంటలు

May 27 2020 5:59 PM | Updated on May 27 2020 6:34 PM

Fire Breaks Out At Narketpally Substation In Nalgonda District - Sakshi

సాక్షి, నల్గొండ: నార్కట్‌పల్లిలోని విద్యుత్ సబ్‌ స్టేషన్‌లో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. భారీగా అగ్ని కీలలు ఎగిసి పడుతున్నాయి. పోలీసు, ఎలక్ట్రిసిటీ, అగ్నిమాపక దళ సిబ్బంది వెనువెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రానప్పటికీ.. అధిక ఉష్ణోగ్రతకు తోడు వర్షం పడటంతో 220/132 కేవీ సబ్ స్టేషన్‌లో షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ ట్రాన్స్‌ ఫార్మర్లు పేలి పోవడంతో ఆ ప్రాంతమంతా గట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement