రైతు శ్రేయస్సే కాంగ్రెస్‌ లక్ష్యం

The Farmer's Well-being Is The Congress's Goal - Sakshi

సాక్షి, గద్వాల రూరల్‌: దేశానికి పట్టుగొమ్మలైన రైతులను అన్ని విధాలుగా ఆదుకొని వారి శ్రేయస్సును కోరేది కాంగ్రెస్‌ మాత్రమేనని టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం డీకే బంగ్లాలో పూడూరు, జంగంపల్లి గ్రామాల ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. కేవలం అధికారం కాంక్షతోనే టీఆర్‌ఎస్‌ జిమ్మిక్కులు చేస్తుందని, శాశ్వత అభివృద్ధి, రైతులకు మద్దతు ధర కల్పన కాంగ్రెస్‌ ద్వారానే సాధ్యమన్నారు.

మహిళలు, వృద్ధులు, వికలాంగులు, నిరుద్యోగ యువతకు అవకాశాల కల్పనకు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చడం జరిగిందన్నారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం పొందుటకు ఎమ్మెల్యే డీకే అరుణను గెలిపించాలని కోరారు. వెంకటేష్, వెంకట్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

భారీ మెజార్టీతో గెలిపించాలి
మల్దకల్‌: గద్వాల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డీకే అరుణను నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని డీకే అరుణ కుమార్తె డీకే స్నిగ్ధారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని బిజ్వారంలో గద్వాల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డీకే అరుణ తరఫున డీకే స్నిగ్ధారెడ్డి, మల్దకల్‌ మాజీ ఎంపీపీ సత్యారెడ్డి, మురళీధర్‌రెడ్డి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్‌ గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని, మళ్లీ ఇప్పుడు చెప్పే మాయమాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంను ప్రారంభించారు. రమేష్‌రెడ్డి, చక్రాధర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మీ పాల్గొన్నారు. 

దొరల పాలనను అంతం చేద్దాం
ధరూరు: ఈ ఎన్నికల్లో దొరల పాలనను అంతమొందిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్ర ఏర్పాటుతో కేసీఆర్‌ కుటుంబానికి తప్ప ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మండలంలోని అల్వలపాడు, కొత్తపాలెం, తండా, కోతులగిద్ద, ర్యాలంపాడు, మార్లబీడు, చెన్నారెడ్డిపల్లి, బూరెడ్డిపల్లి, ఓబులోనిపల్లి, జాంపల్లి తదితర గ్రామాల్లో ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరగలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు నేరుగా లబ్ధిదారులకే అందిస్తామన్నారు. ప్రతి మహిళా సంఘానికి రూ.10 లక్షల రుణం, లక్ష గ్రాంట్‌ను అందిస్తామన్నారు.

గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీకి మంచి ఆధరణ లభిస్తోందని, టీఆర్‌ఎస్‌ జూట మటలు నమ్మకుండా కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాంచంద్రారెడ్డి, డీఆర్‌ విజయ్, శ్రీకాంత్‌రెడ్డి, కిష్టన్న, లింగారెడ్డి, వాహిద్, ప్రతాప్, బుచ్చిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తిరుమల్‌బాస్, అంజిరెడ్డి, రాజేష్, హన్మంతరాయ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top