ఆత్మహత్యకు పాల్పడిన యువరైతు మృతి | farmer died in nalgonda district | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యకు పాల్పడిన యువరైతు మృతి

Nov 20 2015 2:21 PM | Updated on Oct 2 2018 5:51 PM

నల్లగొండ జిల్లాలో అప్పులబాధతో ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు.

యాదగిరిగుట్ట: నల్లగొండ జిల్లాలో అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువరైతు మృతి చెందాడు. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామానికి చెందిన వీరు నాయక్(30) కౌలు రైతు.

వ్యవసాయం సాగు కలిసి రాకపోవడంతో సుమారు రూ.5 లక్షల మేర అప్పులయ్యాయి. అప్పులు తీర్చే దారిలేక ఈ నెల 17న పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. నాయక్ మృతితో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement