వేములవాడను రాజన్న జిల్లాగా ప్రకటించాలి | District VEMULAWADA announce RAJANNA | Sakshi
Sakshi News home page

వేములవాడను రాజన్న జిల్లాగా ప్రకటించాలి

May 21 2016 6:31 AM | Updated on Mar 29 2019 9:31 PM

వేములవాడను రాజన్న జిల్లాగా ప్రకటించాలి - Sakshi

వేములవాడను రాజన్న జిల్లాగా ప్రకటించాలి

దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడను రాజన్న జిల్లాగా ప్రకటించాలి. లేదా కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలి......

అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా
గుడి ఎదుట బైఠాయించిన నాయకులు

వేములవాడ : ‘దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడను రాజన్న జిల్లాగా ప్రకటించాలి. లేదా కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలి.’ అని డిమాండ్ చేస్తూ శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో రాజన్న గుడి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ త్వరలో రాజన్న గుడి ఎదుట నిరాహార దీక్ష, సిరిసిల్ల, కరీంనగర్‌లకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయంగా ఉన్న వేములవాడను రాజన్న జిల్లాగా ప్రకటిం చాలని లేదా కరీంనగర్ జిల్లాలోనే కొన సాగించాలని కోరారు. కార్యక్రమంలో కన్వీనర్ బొజ్జ కనుకయ్య, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, జేఏసీ నాయకులు ఆది శ్రీనివాస్, ఏనుగు మనోహర్‌రెడ్డి, సుదర్శన్‌యాదవ్, మధు రాధాకిషన్, చిలుక రమేశ్, గన్నమనేని రామారావు, తూం మధు, నామాల పోచె ట్టి, సంద్రగిరి శ్రీనివాస్‌గౌడ్, ఆర్. దేవేందర్, కూర దేవయ్య, అంజయ్యగౌడ్, గాజర్ల బుగ్గయ్య, కే. రాజేందర్, రేగుల మల్లికార్జున్, నక్క భూమేశ్, కడారి రాములు, ల్యాగల రమేశ్, మస్తాన్, శ్రీధర్‌గౌడ్‌లతోపాటు యాభై మంది పాల్గొన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement