తెలంగాణ శాసన సభలో శుక్రవారం నుంచి బడ్జెట్‌పై చర్చ ప్రారంభం కానుంది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సమర్పించిన బడ్జెట్‌పై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తరపున చర్చను ప్రారంభించనున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ శాసన సభలో శుక్రవారం నుంచి బడ్జెట్‌పై చర్చ ప్రారంభం కానుంది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సమర్పించిన బడ్జెట్‌పై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తరపున చర్చను ప్రారంభించనున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో భూముల క్రమబద్దీకరణ, ఉద్యోగులకు వేతన సవరణ, నదుల అనుసంధానం, దీపం పథకం, మిషన్ కాకతీయ, యాదగిరిగుట్ట అభివృద్ధి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్‌కు నూతన భవన నిర్మాణం లాంటి అంశాలు సభ ముందుకు రానున్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ఇవాళ ప్రకటన చేసే అవకాశముంది. రైతుల ఆత్మహత్యలు, సమస్యలు , కరువుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది.


