రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి : నాయిని | Developed two states: Nayini | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి : నాయిని

Sep 8 2014 3:04 AM | Updated on Oct 20 2018 5:03 PM

తెలుగు విద్యార్థులకు మంచి ప్రతిభ ఉందని, మనవాళ్లు ఎక్కడకు పోయినా రాణిస్తారని రాష్ట్ర హోంశాఖా మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు.

నాంపల్లి: తెలుగు విద్యార్థులకు మంచి ప్రతిభ ఉందని, మనవాళ్లు ఎక్కడకు పోయినా రాణిస్తారని రాష్ట్ర హోంశాఖా మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు. అమెరికా తదితర దేశాల్లో తెలుగు ప్రజలు కీలక ఉద్యోగాలు చేస్తున్నారని వెల్లడించారు.

ఆదివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో సంగమ్ కళా గ్రూపు ఆధ్వర్యంలో విద్యార్థులకు రాష్ట్రస్థాయి పాటల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  రాజకీయాల్లో విబేధాలు రావడంతో రాష్ట్రం బాగా దెబ్బతిన్నదని చెప్పారు.
 
ఆర్థికంగా దెబ్బతిన్న రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పాలకుల పరిపాలన సరిగా లేకపోవడంతోనే తెలుగు వాళ్లు రెండుగా విడిపోవాల్సి వచ్చిందని వెల్లడించారు. పాటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు ఢిల్లీలో జరిగే ఫైనల్ పోటీల్లోనూ విజయం సాధిస్తారని ఆకాంక్షించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement