'అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తా' | Deputy cm T. Rajaiah takes charges | Sakshi
Sakshi News home page

'అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తా'

Jun 7 2014 12:27 PM | Updated on Sep 2 2017 8:27 AM

ఉప ముఖ్యమంత్రిగా వైద్య, ఆరోగ్య శాఖమంత్రి తాటికొండ రాజయ్య శనివారం బాధ్యతలు స్వీకరించారు.

హైదరాబాద్ : ఉప ముఖ్యమంత్రిగా వైద్య, ఆరోగ్య శాఖమంత్రి తాటికొండ రాజయ్య శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు ఉద్యోగ సంఘాలు అభినందనలు తెలిపాయి. వైద్య ఆరోగ్య మంత్రి హోదాలో రాజయ్య ...తొలిగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని చిన్నపిల్లల వార్డును 50 పడకల నుంచి 120 పడకలకు పెంచుతూ తొలి సంతకం చేశారు.

 

అలాగే మెదక్ జిల్లా నంగునూరులో 50 పడకల ఆస్పత్రిని మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వైద్యరంగంలో అవినీతికి ఆస్కారం లేకుండా కృషి చేస్తామని రాజయ్య తెలిపారు. వైద్య విద్యను ప్రోత్సహించి, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలో అన్ని ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు రాజయ్య తెలిపారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement