క్యూనెట్‌ కేసు; ఆ ముగ్గురు సమాధానం ఇ‍వ్వలేదు | Cyberabad Police Send Notices To Bollywood Celebrities For QNet Scam Case | Sakshi
Sakshi News home page

క్యూనెట్‌ కేసు; ఆ ముగ్గురు సమాధానం ఇ‍వ్వలేదు

Aug 2 2019 3:34 PM | Updated on Aug 2 2019 4:55 PM

Cyberabad Police Send Notices To Bollywood Celebrities For QNet Scam Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేలకోట్ల‍ కుంభకోణం జరిగిన మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ సంస్థ క్యూనెట్‌ కేసులో పలువురు బాలీవుడ్‌ నటులకు సైబరాబాద్‌ పోలీసులు ఇదివరకే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే మొదటిసారి నోటీసులకు స్పందించని ఆరుగురు బాలీవుడ్‌ నటులకు.. మళ్లీ రెండోసారి కూడా నోటీసులు పంపారు. ఈ నోటీసులు అందుకున్న వారిలో షారుక్‌ ఖాన్‌, అనిల్‌ కపూర్‌, బోమన్‌ ఇరానీలు మాత్రమే తమ లీగల్‌ అడ్వకేట్‌ ద్వారా సమాధానం ఇచ్చారు. అయితే మరో ముగ్గురు పూజా హెగ్దే, వివేక్‌ ఒబేరాయ్‌, జాకీ ష్రాఫ్‌ ఇంకా సమాధానం ఇవ్వలేదు. క్యూనెట్‌ కేసులో సైబరాబాద్‌ పోలీసులు మొత్తం 500 మందికి నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజలు కిందట మాదాపూర్‌కు చెందిన క్యూనెట్‌ బాధితుడు ఆత్మహత్య  చేసుకున్న సంగతి విధితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement