అర్హత లేకున్నా‘యునానీ’ అడ్మిషన్లు! 

Confusion over replacement of medical seats - Sakshi

యాజమాన్య కోటా కింద వైద్య సీట్ల భర్తీలో గందరగోళం 

సాక్షి హైదరాబాద్‌: యాజమాన్య కోటా కింద యునానీ వైద్యసీట్ల భర్తీలో గందరగోళం నెల కొంది. నీట్‌లో అర్హత లేకున్నా కొంతమందికి సీట్లు ఇచ్చారని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ మెడిసిన్‌(సీసీఐఎం) నిబంధనలకు అనుగుణంగా అడ్మిషన్లు ఇచ్చామని కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారు. పాతబస్తీ బండ్లగూడలోని అల్‌ ఆరీఫ్‌ యునానీ మెడికల్‌ కాలేజ్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ యునానీ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ(బీయూఎంఎస్‌)కు 100 సీట్లున్నాయి.

అల్‌ అజీజియా ఎడ్యుకేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కాలేజి కాళోజీ వర్సిటీ పరిధిలో ఉంది. 2017–18 సంవత్సరానికిగాను నీట్‌ అర్హత పొందిన 50 మందికి కౌన్సెలింగ్‌ పద్ధతి లో అడ్మిషన్లు ఇచ్చారు. మిగతా 50 సీట్లను మేనేజ్‌మెంట్‌ కోటా కింద భర్తీ చేస్తున్నట్లు సొసైటీ జనరల్‌ సెక్రటరీ ఎహ్‌సానుల్‌ హక్‌ పత్రికా ప్రకటన ఇచ్చి అడ్మిషన్లు స్వీకరించారు. అయితే, మేనేజ్‌మెంట్‌ ద్వారా అడ్మిషన్లు తీసు కున్నవారు నీట్‌లో అర్హత పొందలేదని, ఇవి సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ మెడిసిన్‌ (సీసీఐఎం) నిబంధనలకు విరుద్ధమని వర్సిటీ ప్రకటించింది. ఈ మేరకు మార్చిలో వర్సిటీ రిజిస్ట్రార్‌ 50 మంది అడ్మిషన్లను రద్దు చేశారు.  

తిరిగి జూలైలో ఆడ్మిషన్లు.. 
గతంలో అడ్మిషన్లు రద్దు చేసిన 50 మందిలో నుంచి 19 మందికి అడ్మిషన్లు ఇస్తూ ఇటీవల వర్సిటీ అధికారులు కాలేజ్‌కు ఉత్తరం పంపా రు. ఈ విషయాన్ని కాలేజ్‌ యాజమాన్యం గోప్యంగా ఉంచిందని, అక్రమంగా అడ్మిషన్లు పొందిన విద్యార్థుల నుంచి కాలేజ్‌ యాజమా న్యం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిం దని అడ్మిషన్లు లభించని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సీసీఐఎం నిబంధనల ప్రకారం అడ్మిష న్‌ పొందాలంటే నీట్‌లో కనీసం 131 మార్కులు సాధించాలి. అడ్మిషన్లు పొందిన వారికి నీట్‌లో 20 మార్కులే వచ్చాయని ఆరోపిస్తున్నారు. దీనిపై మిగతా విద్యార్థులు సీసీఐఎంను సంప్రదించగా నీట్‌ అర్హత లేకుండా అడ్మిషన్లు ఇవ్వడం నిబంధనలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. 

నిబంధనల ప్రకారమే అడ్మిషన్లు..
గతంలో విద్యార్థులకు సంబంధించిన పూర్తి వివరాలను విశ్వవిద్యాలయానికి సమర్పించకపోవడంతో అడ్మిషన్లు రద్దు చేశాం. తిరిగి ఆ విద్యార్థుల పూర్తి వివరాలను కాలేజ్‌ అందజేయడంతో సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ మెడిసిన్‌ నిబంధనల ప్రకారమే అడ్మిషన్లు ఇచ్చాం. మిగతా విద్యార్థులకు కూడా అడ్మిషన్లు ఇస్తాం. 
–డాక్టర్‌ బి.కరుణాకర్‌రెడ్డి,కాళోజీ హెల్త్‌ వర్సిటీ, వైస్‌ చాన్స్‌లర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top