నిద్ర లేకుండా చేస్తున్నారు..  | Complaint Against Pubs In Jubilee Hills | Sakshi
Sakshi News home page

నిద్ర లేకుండా చేస్తున్నారు.. 

Jul 17 2018 11:51 AM | Updated on Mar 19 2019 6:59 PM

Complaint Against Pubs In Jubilee Hills - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ ‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36 లోని పెద్దమ్మ దేవాలయం కమాన్‌ వద్ద ఉన్న ఆమ్నేషియా లాంజ్‌ పబ్‌లో అర్ధరాత్రి దాటినా శబ్దాలు చేస్తూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని రౌనక్‌ బండారి అనే యువకుడు నగర పోలీసు కమిషనర్‌కు ట్విట్టర్‌ వేదికగా ఫిర్యాదు చేశాడు. గత కొంత కాలంగా ఈ పబ్‌ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగుతున్నదని ఇష్టారాజ్యంగా మ్యూజిక్‌ ప్లే చేస్తూ న్యూసెన్స్‌కు పాల్పడుతున్నారని ఆరోపించాడు.

దీనిపై స్పందించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు నైట్‌ డ్యూటీ ఆఫీసర్‌తో పాటు పెట్రోలింగ్‌ పోలీసులను పంపి మ్యూజిక్‌ను ఆపివేయడం జరిగిందని సమాధానమిచ్చారు. శబ్ధకాలుష్యం లేకుండా తగిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అయితే రౌనక్‌ బండారి ఇందుకు సంతృప్తి చెందలేదు. ఆదివారం రాత్రి కూడా మ్యూజిక్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, భారీ శబ్ధాలతో ఇబ్బందులు పడ్డామంటూ మరోసారి ట్వీట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement