ఫాంహౌస్‌లో సీఎం కేసీఆర్ బస | cm kcr stays in his farm house | Sakshi
Sakshi News home page

ఫాంహౌస్‌లో సీఎం కేసీఆర్ బస

May 9 2015 8:32 PM | Updated on Jun 4 2019 5:04 PM

ఫాంహౌస్‌లో సీఎం కేసీఆర్ బస - Sakshi

ఫాంహౌస్‌లో సీఎం కేసీఆర్ బస

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం గజ్వేల్, మర్కూక్ ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం జగదేవ్‌పూర్ మండలంలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం గజ్వేల్, మర్కూక్ ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం జగదేవ్‌పూర్ మండలంలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు గజ్వేల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు. 2 గంటలకు గజ్వేల్ నుంచి ములుగు మండలం మర్కూక్లో నాలుగు అభివృద్ధి పనులకు శంకస్థాపనలు చేశారు. అదే దారిన సీఎం కాన్వాయ్ శివారు వెంకటాపూర్ మీదుగా ఎర్రవల్లి గ్రామ సమీపంలో ఉన్న ఫాంహౌస్‌కు చేరుకుంది.

మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, కలెక్టర్ రాహుల్ బొజ్జా, పార్టీ ముఖ్య నేతలు కూడా ఫాంహౌస్‌కు చేరుకొని ఇక్కడే సీఎంతో కలసి భోజనం చేశారు. అనంతరం మిగతా వారంతా వెళ్లిపోగా సీఎం మాత్రం ఉండిపోయారు. రాత్రి ఇక్కడే బసచేసి ఆదివారం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement