12న సీఎం రాక! | cm kcr arraival on 12th march at Sadashivanagar | Sakshi
Sakshi News home page

12న సీఎం రాక!

Mar 10 2015 3:07 AM | Updated on Aug 14 2018 10:51 AM

12న సీఎం రాక! - Sakshi

12న సీఎం రాక!

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటన ఎట్టకేలకు ఖరారైంది.

- సదాశివనగర్‌లో ‘మిషన్ కాకతీయ’కు శ్రీకారం
- కూలీలతో కలిసి పనులలో పాల్గొననున్న కేసీఆర్

కామారెడ్డి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. ‘మిషన్ కాకతీయ’ పనులకు శ్రీకారం చుట్టేందుకు ఆయన ఈ నెల 12న కామారెడ్డి డివిజన్ ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలో ఉన్న సదాశివనగర్ మండల కేంద్రానికి రానున్నారని తెలిసింది. అక్కడ చెరువు పూడికతీత, పునరుద్ధరణ పనులను సీఎం ప్రారంభిస్తారు.

అంతేకాకుండా కూలీలతో కలిసి పనులలో పాల్గొని అక్కడే భోజనం చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు సోమవారం సాయంత్రం జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు అందినట్టు సమాచారం. దీంతో అధికారులు సీఎం పర్యటనకు సంబందించిన అంశంపై అంతర్గతంగా చర్చించుకున్నారు. గత రెండు నెలలలో కామారెడ్డి, బాన్సువాడకు రావలసిన సీఎం అనివార్య కారణాలతో రాలేకపోయూరు. ఎట్టకేలకు సదాశివనగర్‌లో పర్యటన ఖరారైనట్టు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement