మెడికల్‌ టూరిజం హబ్‌గా హైదరాబాద్‌ | Citizens Hospitals : Center For Digestive Disorders Open By Minister Harish | Sakshi
Sakshi News home page

మెడికల్‌ టూరిజం హబ్‌గా హైదరాబాద్‌

Jun 29 2017 1:48 AM | Updated on Sep 4 2018 5:24 PM

మెడికల్‌ టూరిజం హబ్‌గా హైదరాబాద్‌ - Sakshi

మెడికల్‌ టూరిజం హబ్‌గా హైదరాబాద్‌

దక్షిణాసియాలోనే మెడికల్‌ టూరిజానికి హైదరాబాద్‌ హబ్‌గా మారిందని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు.

రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు
వైద్యం కోసం నగరానికొచ్చే వారు పెరిగారు
మెడికల్‌ టూరిజంతో ఉపాధి అవకాశాలు
రాష్ట్రాభివృద్ధిలో ఆస్పత్రుల భాగస్వామ్యం
సిటిజన్‌ హాస్పిటల్‌లో డైజెస్టివ్‌ డిజార్డర్స్‌ విభాగం ప్రారంభం


హైదరాబాద్‌: దక్షిణాసియాలోనే మెడికల్‌ టూరిజానికి హైదరాబాద్‌ హబ్‌గా మారిందని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. బుధవారం శేరిలింగంపల్లి నల్లగండ్లలోని సిటిజన్‌ హాస్పిట ల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సెంటర్‌ ఫర్‌ డైజెస్టివ్‌ డిజార్డర్స్‌ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. నగరంలో డైజెస్టివ్‌ డిజార్డర్స్‌ కు సంబంధించి సిటిజన్‌ హాస్పిటల్‌ రెండో దని అన్నారు. నగరంలో మెడికల్‌ టూరిజం ను ప్రోత్సహించడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, దీని వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, తద్వారా హాస్పిటల్స్‌ కూడా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నా యని చెప్పారు.

 హైదరాబాద్‌లో మంచి హాస్పి టల్స్‌ ఉండటం వల్ల వివిధ దేశాల నుంచి వైద్యం కోసం చాలా మంది విదేశీయులు వస్తున్నారని, దీంతో మెడికల్‌ టూరిజం విస్తరిస్తోందన్నారు. నిపుణులైన వైద్యులుండ టంతో పాటు వాతావరణ పరిస్థితులు, సంప్ర దాయం కూడా అనుకూలంగా ఉందని, అదే విధంగా భాష సమస్య కూడా లేకపోవడంతో అరబ్‌ దేశాల నుంచి వైద్యం కోసం ఎక్కువగా వస్తున్నారన్నారు. కేన్సర్, డైజెస్టివ్‌ డిజార్డర్స్‌ విషయంలో నిర్లక్ష్యం వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో హాస్పిటల్స్‌కు అవసరమయ్యే పరి కరాలు, మిషనరీ వంటి వాటి తయారీకి ఇటీవల 250 ఎకరాల్లో మెడికల్‌ డివైజ్‌ పార్కు ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

 సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తు న్నట్లు తెలిపారు. డైజెస్టివ్‌ డిజార్డర్స్‌ విభా గాన్ని ఏర్పాటు చేసిన సిటిజన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ను ఆయన అభినందించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు వారికి ఉంటాయన్నా రు. దేశంలోనే తెలం గాణ 18.2 వృద్ధిరేటుతో అభివృద్ధి సాధిస్తోం దని చెప్పారు. ఇంటింటికీ మంచి నీటిని అందించేందుకు మిషన్‌ భగీరథ పథకాన్ని తీసుకువచ్చామని, మిషన్‌ కాకతీయ లో భాగంగా 46 వేల చెరువుల్లో పూడిక తీశామని వివరించారు. విద్యుత్‌ అంతరా యం లేకుండా మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దామని, షీ టీమ్స్‌తో భద్రత వంటి వాటిని అమలు చేస్తు న్నామని పేర్కొన్నారు.

 చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ పరీదుద్దీన్, బుద్దవనం ప్రాజెక్టు చైర్మన్‌ మల్లెపల్లి లక్ష్మయ్య, స్టేట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు చైర్‌పర్సన్‌ రాగం సుజాత యాదవ్, హాస్పిటల్‌ మెడికల్‌ డైరెక్టర్‌ బాబయ్య, ఫెసిలిటీ డెరెక్టర్‌ నీలేష్‌గుప్తా, డాక్టర్‌ సురేష్‌చంద్ర, కార్పొరేటర్స్‌ కొమిరిశెట్టి సాయిబాబా, రాగం నాగేందర్‌యాదవ్, నవతారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పుష్పా నాగేష్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement