'నాపై దాడి చేసిన వారిని ఇంకా అరెస్ట్ చేయలేదు' | chinna reddy takes on kcr | Sakshi
Sakshi News home page

'నాపై దాడి చేసిన వారిని ఇంకా అరెస్ట్ చేయలేదు'

May 26 2015 5:36 PM | Updated on Aug 15 2018 9:27 PM

'నాపై దాడి చేసిన వారిని ఇంకా అరెస్ట్ చేయలేదు' - Sakshi

'నాపై దాడి చేసిన వారిని ఇంకా అరెస్ట్ చేయలేదు'

తనపై దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలను ఇంకా అరెస్ట్ చేయలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు.

హైదరాబాద్: ఎమ్మెల్యేపై దాడి చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు గవర్నర్ నరసింహన్ ను కలసి ఫిర్యాదు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  చిన్నారెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.

తనపై దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలను ఇంకా అరెస్ట్ చేయలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని చెప్పారు. తెలంగాణలో ప్రతిపక్షం ఉండకూడదనే ధోరణిలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాలన సాగుతోందని విమర్శించారు. గవర్నర్ జోక్యం చేసుకుని శాంతిభద్రతులు కాపాడాలని గవర్నర్ నరసింహన్ను కోరినట్టు చిన్నారెడ్డి తెలిపారు. తెలంగాణను కేసీఆర్ సొంత ఎస్టేట్లా భావిస్తున్నారని టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పార్టీ కార్యక్రమాలుగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందకు కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement