సీఎం ప్రజావాణిలో 396 దరఖాస్తులు | 396 Applications Received in CM Prajavani | Sakshi
Sakshi News home page

సీఎం ప్రజావాణిలో 396 దరఖాస్తులు

May 22 2026 8:50 PM | Updated on May 22 2026 8:50 PM

396 Applications Received in CM Prajavani

సాక్షి,ఆదిలాబాద్‌: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన 224వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 396 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 163, రెవెన్యూ శాఖకు సంబంధించి 47, ఇందిరమ్మ ఇండ్ల కోసం 113, ప్రవాసి ప్రజావాణికి 01 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 72 దరఖాస్తులు అందాయి.

సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏ.సీ.పీ. ఉమేందర్, ఎన్.ఆర్.ఐ. సమన్వయ మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement