స్వస్థలాలకు బాలకార్మికులు | child labours sends to native places | Sakshi
Sakshi News home page

స్వస్థలాలకు బాలకార్మికులు

Feb 3 2015 2:42 AM | Updated on Sep 2 2017 8:41 PM

గాజుల బట్టీల్లో ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య పనిచేస్తూ పోలీసుల కార్డన్‌సెర్చ్ ఆపరేషన్‌లో దొరికిన చిన్నారులను వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

హైదరాబాద్: గాజుల బట్టీల్లో ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య పనిచేస్తూ పోలీసుల కార్డన్‌సెర్చ్ ఆపరేషన్‌లో దొరికిన చిన్నారులను వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రామంతాపూర్‌లోని డాన్‌బాస్కో స్నేహసదన్‌తో పాటు, మరి కొన్ని చోట్ల ఆ బాలకార్మికులకు ప్రభుత్వం తాత్కాలికంగా ఆశ్రయం కల్పించింది. అయితే, ఆ చిన్నారుల్లో 14 మంది చికెన్‌ఫాక్స్, జ్వరం తదితర అనారోగ్య సమస్యలతో నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కమిటీ

 బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోలీస్, కార్మిక, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన రామంతాపూర్‌లోని డాన్‌బాస్కో స్నేహ సదన్‌లో బాల కార్మికులను కలసి వారి యోగాక్షేమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాల కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు రైల్వే అధికారులను సంప్రదించగా రోజుకు ఒక ప్రత్యేక బోగీ కేటాయించేందుకు వారు అంగీకరించినట్లు తెలిపారు. మంగళవారం 75 మంది బాల కార్మికులను వారి స్వరాష్ట్రాలకు తరలించి తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెప్పారు. చిన్నారులతో వెట్టిచాకిరి చేయిస్తున్న మాఫియాపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement