బతుకమ్మ చీరల పేరుతో తెలంగాణ మహిళా లోకాన్ని ప్రభుత్వం అవమాన పరిచిందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ మండిపడ్డారు.
'చీరల పంపిణీ అట్టర్ ఫ్లాప్'
Sep 19 2017 2:15 PM | Updated on Sep 19 2017 4:46 PM
హైదరాబాద్: బతుకమ్మ చీరల పేరుతో తెలంగాణ మహిళా లోకాన్ని ప్రభుత్వం అవమాన పరిచిందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ మండిపడ్డారు. ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. చేనేత చీరలు ఇస్తామని చెప్పి నాసిరకం చీరల అంటగట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా కేసీఆర్ నోరు మెదపడం లేదు. చీరల కోసం లైన్లో నిలబడిన మహిళలు ఈ నాసిరకం చీరలను చూసి బేజారయ్యే దగ్ధం చేస్తున్నారు. చీరల పేరిట పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఈ కుంభకోణంపై సిటింగ్ జడ్జీతో విచారణ జరిపించాలి. రాష్ట్ర మహిళాలోకానికి కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement