ప్రైవేట్ ఆస్పత్రిలో శిశువు మృతి | Baby in a private hospital | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ ఆస్పత్రిలో శిశువు మృతి

Jul 13 2014 3:43 AM | Updated on Oct 8 2018 5:04 PM

జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో ఓ 20 రోజుల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితులు ఆందోళనకు దిగారు.

మహబూబ్‌నగర్ క్రైం : జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో ఓ 20 రోజుల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే... 20  రోజుల కిత్రం నవాబుపేట మండలం ఫత్తేపూర్‌కు చెందిన మల్లేశ్వరిని కాన్పు కోసం మహబూబ్‌నగర్ పట్టణంలోని సుసృత ప్రజా వైద్యశాలకు భర్త కాశీమయ్యగౌడ్ తీసుకురాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటకే ఆమె కు ఇద్దరు అడపిల్లలున్నారు. దీంతో భార్యాభర్తలతో పాటు బంధువుల సంతోషానికి అవధులులేవు. అయితే మరుసటి రోజు శిశువుకు నిమోనియా వచ్చిందంటూ వైద్యులు చెప్పి మూడురోజుల పాటు చికిత్సలు అందించారు. చివరకు పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో శిశువును నవోదయ ఆస్పత్రికి తరలించారు. శిశువుకు ప్రతిరోజూ రూ.13 వేల చొప్పున చెల్లించి ప్రత్యేక గదిలో ఉంచి వైద్య చికిత్సలు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే శని వారం ఉదయం తెల్లవారుజామున బాధితులను లేపి మిగతా రూ.30 వేలు చెల్లించాలని నిర్వాహకులు ఒత్తిడి తె చ్చారు. అనుమానం రావడంతో తమ బిడ్డను చూయిస్తేనే డబ్బులు కడతామని చెప్పడంతో శిశువు రాత్రి చనిపోయిందని వారిని సిబ్బంది బయటకు గెంటి వేశారు.
 
 ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువు లు ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేపట్టారు. శిశువు చనిపోయిన విషయం దాచి రోజు చికిత్సలు చేస్తున్నట్లు నటించి డబ్బులు కట్టించుకున్నారని ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందాడన్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బాధితులను సముదాయించారు. చివరకు ఆస్పత్రి నిర్వాహాకులతో చర్చించి బాధితులు చెల్లించిన రూ.1.6 లక్షలతో పాటు మరో రూ.20 వేలు అదనంగా ఇ ప్పించి సమస్యను పరిష్కరించి గొడవ సద్దుమణిగించారు.దీంతోవారు మృతశిశువును ఇంటికి తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement