కవలల్ని విడదీసిన తల్లిదండ్రులు

Baby Girl To ICDS - Sakshi

ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించిన తల్లిదండ్రులు 

ఇబ్రహీంపట్నం : ఆడబిడ్డను సాకలేమని 13 రోజుల శిశువును తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు. మంచాల మండలం వెంకటేశ్వర తండాకు చెందిన ఆ శిశువు తల్లిదండ్రులకు (పేర్లు వెల్లడించేందుకు నిరాకరణ) అంతకు ముందు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. మూడో కాన్పుల్లో అడ, మగ కవల పిల్లలకు ఆ తల్లి జన్మనిచ్చింది.   కవలల్లో మగ పిల్లాడిని ఉంచుకొని, ఆడపిల్లను ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు.  

నలుగురిని సాకే ఆర్థిక స్థోమత తమకు లేదని తల్లిదండ్రులు తెలిపారు. ఆడ శిశువును ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ అధికారిణి శాంతిశ్రీకి అప్పగించారు. ఆ శిశువును నగరంలోని శిశువిహార్‌కు తరలించినట్లు శాంతిశ్రీ తెలిపారు. తమ వివరాలు వెల్లడించవద్దని ఆ కుటుంబసభ్యులు తెలిపినట్లు  ఆమె చెప్పారు.  1

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top