10న ఆటోలు బంద్‌: ఆటోడ్రైవర్స్‌ జేఏసీ

Auto Drivers JAC Have Announced That Autos Will Be Band On 10 - Sakshi

మద్యపానం నిషేధించాలని డిమాండ్‌

సుల్తాన్‌ బజార్‌: దిశ హత్య కేసు నేపథ్యంలో రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు డిమాండ్‌ చేస్తూ ఈనెల 10న ‘షరాబ్‌ హటావో–తెలంగాణ బచావో’అనే నినాదంతో ఒక్క రోజు ఆటోల బంద్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆటోడ్రైవర్స్‌ జేఏసీ వెల్లడించింది. ఈమేరకు ఆదివారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో విలేకరులతో జేఏసీ కన్వీనర్‌ మహ్మద్‌ అమానుల్లా ఖాన్‌ మాట్లాడారు. మద్యపాన నిషేధం లేకపోవడం వల్లే మద్యం మత్తులో దుండగులు  దిశను హత్య చేశారని, నిందితులకు వెంటనే ఉరి శిక్ష విధించాలని ఆయన డిమాండ్‌ చేశారు.  రోడ్డు ప్రమాదాలు, సామాజిక నేరాలు పెరగడానికి ప్రధాన కారణం మద్యం తాగడమేనన్నారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం మద్యాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ఏటా రూ. 500 ఎంవీ ట్యాక్స్‌ మాఫీ చేసి కేసీఆర్‌ చేతులు దులుపుకున్నారని, అదే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతి ఆటోకు రూ. 10 వేలు ఇస్తున్నారని గుర్తు చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top