ఉరి వేసుకుని ఆర్మీ జవాన్ ఆత్మహత్య | army soldier commits suicide hailing from Adilabad district | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని ఆర్మీ జవాన్ ఆత్మహత్య

Jan 26 2015 11:45 PM | Updated on Sep 2 2017 8:18 PM

ఆదిలాబాద్ జిల్లా బొత్‌కు చెందిన ఆర్మీ జవాన్ రత్నపురం నరేష్(23) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

సారంగాపుర్ (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లా బొత్‌కు చెందిన రత్నపురం నరేష్(23) అనే ఆర్మీ జవాన్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మూడేళ్లుగా ఆర్మీ జవాన్‌గా పనిచేస్తున్న నరేష్ గత కొన్ని రోజులుగా విధులకు వెళ్లడం లేదు. ఈనెల 23వ తేదీన ఇల్లు ఒదిలి వెళ్లిపోయాడు. కాగా, సోమవారం ఆయన చించొలి(బి) గ్రామ సమీపంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్మకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement