అదృశ్యమైన బాలుడు దారుణహత్య | 6 years old boy murdered in adilabad distirict | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన బాలుడు దారుణహత్య

May 16 2015 10:35 AM | Updated on Jul 12 2019 3:02 PM

అదృశ్యమైన బాలుడు దారుణహత్య - Sakshi

అదృశ్యమైన బాలుడు దారుణహత్య

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

మందమర్రి : ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గురువారం అదృశ్యమైన బాలుడు వినయ్ ను దుండుగులు హత్యచేశారు. వివరాలు.. జిల్లాలోని మందమర్రి మండలం రామకృష్ణాపురం గ్రామంలోని మల్లికార్జునవగర్‌కు చెందిన వినయ్(6) అదృశ్యమయ్యాడని అబ్బాయి తల్లి నాగలక్ష్మి గురువారం మందమర్రి పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోలీసులు కేసు నమోదుచేశారు.

 

అయితే శనివారం ఉదయం నాగలక్ష్మి ఇంటి సమీపంలో గోనెసంచి మూట కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ రోజు ఉదయం గోనెసంచిని తెరిచి చూసిన పోలీసులకు అందులో వినయ్ మృతదేహం కనిపించింది. వినయ్ తండ్రి సుధాకర్‌ను కూడా ఇలాగే రెండేళ్ల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. తన భర్తను హతమార్చిన వారే తన కుమారుడిని కూడా బలితీసుకుని ఉంటారని నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement