రోడ్డు ప్రమాదంలో 35 గొర్రెలు మృతి | 35 sheeps die in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో 35 గొర్రెలు మృతి

Aug 22 2015 5:52 PM | Updated on Aug 30 2018 3:56 PM

వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులోని కుందయ్యపల్లి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 35 గొర్రెలు మృతిచెందాయి.

గణపురం (వరంగల్ జిల్లా) : వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులోని కుందయ్యపల్లి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 35 గొర్రెలు మృతిచెందాయి. రేగొండ మండలం నాగుర్లపల్లి గ్రామానికి చెందిన బండారి కొమురయ్య, బండారి ఓదెలు, కొడారి రాజయ్య, కొడారి రాజేంద్రంకు చెందిన 400ల గొర్రెలను మేత కోసం భూపాలపల్లి అడవులకు తరలిస్తున్న క్రమంలో కుందయ్యపల్లి దగ్గర తిరుమల పాలను సరఫరా చేసే వ్యాన్ డ్రైవర్ అజాగ్రత్తతో ప్రమాదం జరిగింది. 35 గొర్రెల విలువ రూ.2 లక్షల వరకు ఉంటుంది. గణపురం ఎస్సై విజయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేసి కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement