చదువుకోవాలని ఉంది..

 119 Requests To Prajavani - Sakshi

రెసిడెన్షియల్‌లో సీటు ఇప్పించండంటూ శ్రావణి వినతి

వికలాంగుని పింఛన్, అభయహస్తం పింఛన్‌ ఇప్పించాలని అర్జీ

అవినీతికి పాల్పడుతున్న  వీఆర్‌వోపై చర్యలు తీసుకోండి

ప్రజావాణికి 119 వినతులు

మెదక్‌రూరల్‌ : అమ్మా..నాన్నా లేని అనాథను చదువుకోవాలని ఉంది రెసిడెన్షియల్‌లో సీట్‌ ఇప్పించండి సారూ అంటూ శివ్వంపేట మండలం తల్లెపల్లి తండాకు చెందిన శ్రావణి అనే చిన్నారి ప్రజావాణిలో వేడుకుంది. సోమవారం మెదక్‌ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ నగేశ్‌ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా నలుమూలల నుంచి 119 ఆర్జీలు వచ్చాయి.

శ్రావణి తన నానమ్మ చామంతితో కలిసి ప్రజావాణిలో ఆర్జీని సమర్పించింది. తాను చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలానని, వరుసకు నానమ్మ అయిన చామంతి వద్ద ఉంటున్నట్లు తెలిపింది. శివ్వంపేట ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న తనకు రెసిడెన్షియల్‌లో సీట్‌ ఇప్పించి ఆదుకోవాలని కోరింది.  

మురికి నీటిని వదులుతున్నారు 

ఉద్దేశ్యపూర్వకంగా మా ఇంట్లోకి మురికి నీటిని వదులుతున్నారని హ  వేళిఘణాపూర్‌ మండలం బోగుడ భూపతిపూర్‌ గ్రామానికి చెందిన విఠల్‌గౌడ్‌ ఫిర్యాదు చేశారు. గ్రామంలో తాను ఇళ్ళు నిర్మించుకుటుండగా అదే గ్రామానికి చెందిన సాదుల పోచయ్య ఉద్దేశ్యపూర్వకంగానే మురికి నీటిని, వ్యర్థ జలాలను వదులుతూ అపరిశుభ్ర వాతావరణాన్ని చేస్తున్నారు.  తమకు న్యాయం చేయాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top