‘గీతాంజలి’ భూములు తీసుకుంటాం

1,035 acres resumed from different industries, organisations, says KTR - Sakshi

మండలిలో కేటీఆర్‌ ప్రకటన

95 ఎకరాలు తీసుకుంటాం

పరిశ్రమలు స్థాపించని సంస్థల నుంచి 1,035 ఎకరాలు వెనక్కి తీసుకున్నట్లు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రుణ ఎగవేతదారు నీరవ్‌ మోదీకి చెందిన సంస్థ గీతాంజలి జెమ్స్‌కు కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మొత్తంగా గీతాంజలి జెమ్స్‌కు 190 ఎకరాల భూమిని ఉమ్మడి రాష్ట్రంలో కట్టబెట్టారని, అందులో 95 ఎకరాలకు సేల్‌ డీడ్‌ అయిందని, మరో 95 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. దీనిపై కేంద్ర వాణిజ్య శాఖతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించని సంస్థల నుంచి 1,035 ఎకరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో సభ్యులు ఎంఎస్‌ ప్రభాకర్, కర్నె ప్రభాకర్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. రాష్ట్రంలో 16 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేయనున్నామని, ఇందులో ఇప్పటికే 8 వేల ఎకరాల సేకరణ పూర్తయిందని చెప్పారు. 2005–06 తర్వాత రాష్ట్రానికి కొత్త పారిశ్రామిక పార్కు లు రాలేదని గుర్తుచేశారు.

దేశంలో అతిపెద్ద జౌళి పార్కును సీఎం కేసీఆర్‌ చేతుల మీ దుగా ఏర్పాటు చేశామని తెలిపారు. డ్రైపోర్టు ఏర్పాటుపై దుబాయ్‌ పోర్ట్‌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని, డ్రైపోర్టును ఎక్క డ ఏర్పాటు చేయాలనే విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. చందన్‌వెల్లిలో టెక్స్‌టైల్స్‌ కంపె నీలు పెట్టేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. రాష్ట్రం నలువైపులా ఐటీని విస్తరించాలనేది సీఎం ఆలోచన అని తెలిపారు. రహేజా మైండ్‌ స్పేస్‌లోనే 1.10 లక్షల మందికి ఐటీ ద్వారా ఉపాధి లభిస్తుందని పేర్కొ న్నారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top